పుట:Lanka-Vijayamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

లంకావిజయము


తోక్తికలితుఁ డగుచున్, (సుమిత్రకుఁ దమతమపాయసభాగమును బెట్టుటకు సమ్మతింపఁగా) వసతిన్ = గృహము నందు, “వసతీ రాత్రివేశ్మనో” అమరము. అనుప.....యుతతన్ - అనుపమాన = ఉపమానము లేని, పాయసరస = పరమాన్నరసమును, సుఖానుభవ = సుఖముగా భుజించిన, దార = భార్యలతో, యుతతన్ = కూడుకొనుటచేతను, శుభతన్, తాల్చెన్.


తా.

తాను గోరిన ట్లాయిద్దఱును సుమిత్రకుఁ గూడఁ బాయసము పెట్టఁగా, దానిని భుజించిన భార్యలతో గూడి శోభాయుక్తుఁడై యుండెను.


లక్ష్మణ.

ఏతదనుమతిమిళితవాంఛితోక్తికలితుఁడు = పుర్వోక్తవాంఛితోక్తితో నొప్పుచున్నవాఁడై, వసతిన్ = రాత్రియందు, అనుప.....తతన్ - అనుపమ = సాటిలేని, అనపాయ = అపాయశూన్యమైన, సరససుఖనుభవము గలిగిన, దారయుతతన్ = భార్యతో నుండుటచే, శుభత దాల్చెన్ - శోభిల్లెను.


తా.

సూర్యోపాస్తిచే నానందించుచు గోపాలమంత్రి రాత్రులయందు భార్యతో సరససుఖానుభవముల నొప్పుచుండెను.


వ.

ఇవ్విధంబున నిష్టవినోదంబుల నుండి కొన్నిదినంబులకు
గర్భిణీత్వంబునఁ జెన్నొందుభార్యల సద్రూపంబు గనుంగొని
ప్రీతాత్ముం డై యుండె నంత.

27


రాఘవ.

భార్యల + సద్రూపము అని పదచ్ఛేదము.


లక్ష్మణ.

భార్య+లసద్రూపము అని. తక్కినది సమము సులభము.


శా.

ఆరన్ రాజమహేలలందునను బెద్దై యొప్పుసత్పుణ్య సు
శ్రీరాజద్వరపాదభక్తిఁ గనియెన్ శ్రీరామనాము న్నుతుల్
నేరన్ భార్గవురేణుకాతరుణిపోల్కిన్ భవ్యనానాతప
శ్శ్రీరక్తాత్మమరీచిజాతు నదితిస్త్రీలాగునన్ బాగుగన్.

28


రాఘవ.

ఆరన్ = వృద్ధిఁ బొందునటుల, రాజమహేలలందునను = రాజస్త్రీలయందు, పెద్దైయొప్పు = జ్యేష్టురాలైన, సత్పుణ్య = పుణ్యాత్మురాలు, (కౌసల్య