పుట:Lanka-Vijayamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

లంకావిజయము


ధర్మాప్తి నొనర్పన్ = ధర్మమును బొందున ట్లొనర్చుటకు, నాకు, అరయన్, గురువు, నీవ = నీవే, అటంచున్, పల్కుచున్.


తా.

ఋశ్యశృంగమునీంద్రా! మీరలే నాకు గురువులు, పుత్రులు కలుగున ట్లనుగ్రహించి యొక పాపహారియైన యగ్నికార్యమును జేయుమని కోరెను.


లక్ష్మణ

ఆప్తత, కానిపింపన్, తనయాశయమున్ = తన యభిప్రాయమును (తన + ఆశయము) దెలియంగఁ జేసి, తత్ప్రాప్తికిన్ = తనయభిప్రాయమును పొందుటకు, తొల్తన్, ఓయనఘ = ఓ పాపరహితుఁడా! భవ్యశుచిక్రియన్ = ఔపాసనాదికమును, మన్యువుఁ బాప = కోపమును బోఁగొట్టుకొఱకు, హారిధర్మాప్తిన్ = మనోహర మైనపుణ్యప్రాప్తిని, ఒనర్పన్ = ఒనరించుటకు, యుష్మదాత్మ...మంత్రములన్, జేయుము, అరయ,నాకు, గురువు, నీవ, యటంచున్, పల్కుచున్.


తా.

గోపాలమంత్రి పురోహితునితో దనయభిప్రాయముం జెప్పి ఔపోసనాదిక్రియలు చేయించుమనియెను.


వ.

అతని నొడంబఱిచి.

15


అర్థము రెండు తావుల స్పష్టము.


గీ.

తదనుమతి నొక్కశుభముహూర్తమున దార
సహితముగఁ బూతమంగళస్నాన మొగి నొ
నర్చి సముచితకృత్యమంతయును నడపె
శుచిగురుసపర్య మున్నుగాఁ బ్రచురవిధిని.

16


రాఘవ.

తదనుమతిన్ = ఋశ్యశృంగునియిష్టము ననుసరించి, ఒక్క శుభముహూర్తమున, దారసహితముగన్ = భార్యలతోఁ గూడ, పూతమంగళస్నానము, ఒగిన్ = క్రమముగ, ఒనర్చి = చేసి, ప్రచురవిధిని = ప్రకటప్రకారముగ (స్పష్టముగ), శుచిగురుసపర్య మున్నుగాన్ = శుచిర్భూత