పుట:Lanka-Vijayamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27


లక్ష్మణ.

అతఁడు = గోపాలమంత్రి, అతులితరూపనిర్జితసుమాంబకుఁడు, సుమంత్రముఖ్యులగు = సుష్ఠువులైన యాలోచనములు ముఖ్యముగా గలిగిన, మంత్రుల గోష్టిన్ = నియోగుల గోష్ఠిలో (గోష్టి సభ), గురూపదేశసంగతిన్ = గురువు లుపదేశించినరీతిని, తనయాలిన్ = తనభార్యను, ఒందు = పొందుకొఱకు, సదధ్వరక్షణాదృతిని - సదధ్వ = మంచిమార్గముగలవానిని, రక్షణ = రక్షించుటయందైన, ఆదృతిని = ఆదరణముచే, శాంతవరున్ = శాంతులలో శ్రేష్టుఁడయిన, ప్రియాన్వితున్ = ఇష్టముతోఁ గూడిన, పురోహితున్ = పురోహితుని.


తా.

పెద్దలు చెప్పినరీతిని, తనవారియనుమతిపై పునస్సంధనకార్యము జరగించుకొనవలయునని శాంతుని బుద్ధిమంతుని బురోహితుని (బిలిపించెను.)


వ.

ప్రార్థనాపూర్వకంబుగా రప్పించి యతనికిం దగువిధంబునం
బూజలొనర్చి.

13


అర్థము రెండింటికి స్పష్టము.


ఉ.

ఆప్తత గానిపింపఁ దనయాశయముం దెలియంగఁ జేసి త
త్ప్రాప్తికిఁ దొల్త నోయనఘ భవ్యశుచిక్రియ యుష్మదాత్మని
క్షిప్తము లైనమంత్రములఁ జేయుము మన్యువుఁ బాపహారి ధ
ర్మాప్తి నొనర్ప నాకు గురు వారయ నీవ యటంచుఁ బల్కుచున్.

14


రాఘవ.

ఆప్తత = స్నేహభావము, కానిపింప = తోఁచునట్లు, తనయాశయము - (తనయ+ ఆశయము) తనయ = పుత్రులను గూర్చిన, ఆశయము = అభిప్రాయమును, తెలియంగఁ జేసి, తత్ప్రాప్తికిన్ = ఆ తనయులు గలుగుటకు, తొల్త = ప్రథమమున, ఓయనఘ, భవ్యశుచిక్రియన్ - భవ్య = ఉత్తమమైన, శుచిక్రియం = అగ్నికార్యము (హోమము మొదలైనవి), యుష్మదాత్మనిక్షిప్తము లైనమంత్రములన్ - యుష్మత్ = నీయొక్క, ఆత్మ = మనస్సులో, నిక్షిప్త - ఉంచబడిన, మంత్రములు - మంత్రములచేత, మన్యువున్ = యజ్ఞమును, చేయుము. పాపహారి = పాపమునడంచి,