పుట:Lanka-Vijayamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

లంకావిజయము


విశేషమునందు, ఆత్మదేవున్ = తనయిష్టదేవతలను, అజసంతతిఘనుఁడు = బ్రాహ్మణశ్రేష్ఠుఁడు (అజ = బ్రహ్మ, సంతతి = కులము), ఇష్టార్థసిద్ధికై, ఎపుడున్, వేఁడున్, అతఁడు, అనఘుఁడు, ధైర్యమునను ...... నెందుసవతు లేక. (ముందఱ కన్వయము.)


తా.

గోపాలరామా! నన్ను రక్షింపుము. బ్రహ్మదేవుఁడా! కరుణించుము. ఈశ్వరా! యాదరింపుము. అని యాత్మదైవతములను బ్రార్థించును. ఎందును నతని కితరు లీడురారు.


వ.

ఇవ్విధంబున నిచ్ఛానువర్తనంబులు బ్రవరిల్లుచు నొక్కనాఁడు.

11


దీనియర్థము రెండుపక్షముల స్పష్టము.


చ.

అతులితరూపనిర్జితసుమంబగుఁ డాతఁడు సర్వలోకస
మ్మతిని సుమంత్రముఖ్యు లగుమంత్రులగోష్ఠి గురూపదేశ సం
గతిఁ దనయాలినొందు మదిఁ గాంక్ష దనర్చి సదధ్వరక్షణా
దృతిని బురోహితు న్సుమతిధీరుని శాంతవరుం బ్రియాన్వితున్.

12


రాఘవ.

అతు...సుమాంబకుఁడు - అతులిత = ఉపమానరహితమైన, రూప = సౌందర్యముచే, నిర్జిత = జయింప బడిన, సుమంబరుఁడు = పుష్పాస్త్రుఁడు (మన్మథుఁడు) గల, ఆతఁడు = దశరథుఁడు, సుమంత్రముఖ్యు లగుమంత్రులగోష్ఠిన్, గురూపదేశసంగతిన్ = వసిష్ఠోపదేశమున, సర్వలోకసమ్మతిని = సర్వజనుల సమాధానముతో, తనయాలినొందు = పుత్రసముదాయమును గనునిమిత్తమై, నదధ్వరక్షణాదృతిని - సత్ = శ్రేష్టమైన, అధ్వర = యజ్ఞమనెడు, క్షణ = ఉత్సవమునందలి, ఆదృతిని = ఆదరణముచే, పురోహితున్ - పురా = ఇంతకుముందే, ఊహితున్ = ఊహింపఁబడియున్న, శాంతవరున్ = శాంతాదేవీభర్తయైన ఋష్యశృంగుని, ప్రియాన్వితున్ = భార్యాసహితుని.


తా.

ఆదశరథుఁడు సుమంత్రాదిమంత్రులతో నాలోచించి సంతానము కలుగుటకై యొక యజ్ఞము చేయవలయు నని శాంతపెనిమిటి యగు ఋష్యశృంగుఁడను మునీంద్రుని (పిలిచెను).