పుట:Lanka-Vijayamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25


స్సున నంతోషముగ, మాటాడుము = పల్కుము, అనును = గోరును. కై క = కేకయరాజపుత్త్రీ! రమ్మా = ఇందురమ్ము, ననున్, కదియించి = కౌఁగిలించి, మదిన్, ఆత్మభూలీలన్ = మన్మథలీలయందు, ప్రోవుము = రక్షింపుము. అంచున్, ఓలి = వరుసఁ గా, పల్కున్ = అనును. స్తోత్రార్హభావ = స్తుతింపఁదగినభావముగల, సుమిత్రాబ్జనయన = సుమిత్రయను సుందరీ, నన్ను, ఆదరించుము. అటంచున్, ఆశ్రయించు = చేరును. అట్లు, రహస్యంబునందు, ఆత్మదేవులన్ = తన భార్యలను, ఇష్టార్థసిద్ధికై = కోరికఁ దీరుటకై , ఎపుడున్, వేఁడున్, అనఘుఁడు = పాపరహితుఁడు, అతఁడు' (దశరధుడు), అజసంతతి = అజమహారాజు కొడుకు, ఘనుఁడు = గొప్పవాఁడు, ధైర్యమునను, గాంభీర్యమున, నీతిన్, భూతిన్ = ఐశ్వర్యమున, కీర్తిన్, మూర్తిన్ = ఆకారమున, మానమునను = పౌరుషమున, దానమున, ద్యుతిన్ = కాంతిచే, మతిన్ = బుద్ధిని, శాంతిన్ = కామక్రోధాదిరాహిత్యమున, దాంతిన్ = తపఃక్లేశాదులనోర్చుటయందు, అరయన్ = వెదుకు, ఎందున్ = ఏతావునను, సవతు లేక = ఈడు లేనివాఁడుగానుండి (నక్ష్మమాణపదముతో నశ్వయము).


తా.

దశరథుడు కౌసల్యా నాతో సంతోషముగ మాటాడుము. కైకా నన్ను గదియుము. సుమిత్రా నన్నాదరించు మని రహస్యమున భార్యలను వేఁడును. ధైర్యగాంభీర్యదానాదుల నతని కొరులు సమానులు లేరు.


లక్ష్మణ.

సరస = సరసుఁడా! రామా! జనవర = రాజా! కోసలేశ! జయాత్మ = జయస్వభావముగలవాఁడా! ఆత్మహర్షముగ మాటాడుము అనును. కై = చేయి, కరమ్ము = చేయిని, ఆనను = అనునట్లు, కదియించి = కూర్చి, మదిని, ఆత్మభూ = బ్రహ్మదేవుఁడా! లీలఁ బ్రోవుము = విలాసముగా రక్షింపుము. అంచు, ఓలిన్, పల్కున్ = కొనియాడుననుట. స్తోత్రార్హభా = స్తుతించుట కర్హమైన కాంతిగల, వసుమిత్రాబ్జనయన = అగ్నియు, సూర్యుడు, చంద్రుఁడును నేత్రములు గలవాఁడా! న న్నాదరించు మటంచున్, ఆశ్రయించున్ = శివుని భజించును. (వసు = అగ్ని, మిత్ర = సూర్యుఁడు,అబ్జ = చంద్రుఁడు) "దేవభేదేన వేరశ్మౌవసుః" అమరము. అట్లు, రహస్యంబునన్ = మనస్సులో ననుట. ధ్యాన