పుట:Lanka-Vijayamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


తా.

బుద్ధిమంతు లగుకరణములలో, యోగ్యజనులలో నధికుఁడని యాగోపాలమంత్రిగుణములను గొనియాడుచుందురు.


భుజంగప్రయాతము.

హరించెం దగన్ దుర్జనాత్మానురక్తిన్
భరించెన్ రమానాథపాదాబ్జభక్తిన్
వరించెన్ జనం బెల్ల వర్ణించుయుక్తిన్
ధరించె న్మహామంత్రతంత్రాదిశక్తిన్.

7


తా.

దుర్మతుల యతిశయమును హరించెను. విష్ణుభక్తిని భరించెను. జనులందఱుఁ దన్నుఁ బొగడునట్టియుపాయమును గలిగియుండిను. మంత్రతంత్రములయొక్క శక్తిని ధరించెను.
ఈ పద్యమున రెంటికి సమానార్థము.


గీ.

అతఁడు రాజమందారాచ్ఛవితతకీర్తి
వంశశుక్తిముక్తామణి వరుస శోభఁ
గ్రాలువారి ముగురఁ గాళికాసమాన
వేణికల సమ్మదం బొప్పఁ బెండ్లియాడె.

8


రాఘవ.

రాజమందారాచ్ఛవితతకీర్తి - రాజ = చంద్రునివలె, మందార = కల్పవృక్షమురీతి, అచ్ఛ = స్వచ్ఛమైన, వితత = విస్తారమైన, కీర్తి = యశస్సుగలవాఁడు, వంశశుక్తిముక్తామణి = కులమనుముత్తెపుచిప్పకుమణియు(నైన), అతఁడు = ఆదశరథుడు, కాళికాసమానవేణిళలన్ = మేఘపఙ్క్తితో సమానమైనజడలుగలవారిని, శోభఁగ్రాలువారిన్ = సౌందర్యముచే బ్రకాశించువారిని, ముగురన్ = ముగ్గురుకన్నెలను, వరుసన్ = క్రమముగా, సమ్మదం బొప్పన్, పెండ్లియాడె. “మేఘజాలేపి కాళికా" యని యమరము.


తా.

ఆదశరథుఁడు యశస్సు, సత్కులము, సౌందర్యము గల ముగ్గురు కన్యలను బెండ్లియాడెను.


లక్ష్మణ.

అతఁడు =గోపాలుఁడు, రాజమన్ = రాజమ్మయనెడు, తారాచ్ఛ = నక్షత్రములవలె స్వచ్ఛమైన (ముత్యాలవలె నని యైన) దానిని, వితతకీర్తి