పుట:Lanka-Vijayamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

లంకావిజయము


ప్రాణములను, పిండి = పిండివైచి, ప్రోలివారిన్ = పురవాసులను, నిండువేడ్క, నొందఁ జేసెన్ = మిక్కిలి యానందింపఁ జేసెను. అతని, నెన్నఁగా, వశంబె!


తా.

శత్రువులను సంహరించి జనులను సంతోషపెట్టుటకే యాతఁడు పుట్టినది మొదలు యత్నించెను.


లక్ష్మణ.

సరభసముగ = సంతోషముతో, పూని, పరులజీవనములు = అన్యులజీవనములను, పిండిప్రోలివారిన్, నిండువేడ్కన్, ఒందఁ జేసెను, (పుట్టినది మొదలు చేసికొని) అతని, నెన్నఁగా, వశంబె, పొగడఁ దరము కాదని భావము.


తా.

గోపాలమంత్రి పుట్టినది మొదలు, పిండిప్రోలివారిని యితరులను సంతోష పెట్టెను.


క.

గణుతింతు రెపుడు నాతని
గుణములు సత్కృతులలోను గోవిదులు సుధీ
గణకవితతులందున ను
ల్బణతం గనువిద్యల న్వలంతియగుటచేన్.

6


రాఘవ.

కోవిదులు = విద్వాంసులు, సుధీగణకవితతులందునన్ = విద్వత్కవిసముదాయము నందును, ఉల్బణతంగనువిద్యలన్ = అతిశయించిన విద్యలయందు, పలంతియగుటన్ = సమర్థుఁ డగుటను, అతనిగుణములు = ఆదశరథునిగుణములు, సత్కృతులలోను = రామాయణాది సత్కావ్యములలో, ఎపుడు =ఎల్లకాలమును, గణుతింతురు= ఎన్నుదురు.


తా.

దశరథుఁడు విద్యావంతుఁ డని యాతని గుణములను రామాయణాది గ్రంథములలోఁ బొగడుచుండిరి.


లక్ష్మణ.

కోవిదులు, సుధీ . . . అందు - సుధీ = మంచిబుద్ధిగల, గణకవితతులందు = కరణముల సముదాయమును, సత్కృతులలోను = యోగ్యులగు నేర్పరులలోను (సత్ + కృతులు), “సత్యే సాధౌవిద్యమానే ప్రశస్తేభ్యర్హితే చసత్.” అని యమరము, అతనిగుణములు = ఆగోపమంత్రిగుణములు, ఎపుడును, గణుతింతురు. ఏల? ఉల్బణతంగనువిద్యలన్, వలంతి, యగుటచేతన్.