పుట:Lanka-Vijayamu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

లంకావిజయము

లన్నియున్, ఈడేర్చు = నేఱవేర్చునట్టి, శ్రీవరుఁడా = లక్ష్మీనాథా, తండ్రి, వికుంఠ వాసుఁడ = వైకుంఠనివాసీ, చతుర్వక్త్రాత్మజ = నాలుగు మొగములుగల కుమారుని, ఉత్పత్తికృద్గురుఁడా = పుట్టించిన గొప్పతండ్రీ, చెప్పితిన్ కృతిని = ఈ గ్రంథమును రచించితిని, సంతోషాత్మ = ఆనందమయుఁడా, గోపాలుడా = కుయ్యేరులో వేంచేసిన గోపాలకృష్ణా, చిత్తగింపుము.

గద్యము. ఇది శ్రీమత్కుయ్యేటిగోపాలలీలాకటాక్ష వీక్షణసం ప్రాప్తసాహిత్య సుకవిజనస్తుత్య శుభాపస్తంబసూత్ర భారద్వాజగోత్ర పిండి ప్రోలిగోపొలామాత్యపుత్ర, సరసకవితా లక్షణవిచక్షణ లక్ష్మణకవి ప్రణీతం బైనలంకావిజయం బను ద్వ్యర్థిప్రబంధంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము.

సంపూర్ణము.


చెన్నపురి: 'వావిళ్ల' ప్రెస్పున ముద్రితము: – 1927.