పుట:Lanka-Vijayamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


కుండు - దేవలోకపటుచేతోహర్ష = దేవతల సంతోషమును, దా = ఖండించునట్టి, అహీన- (ఆహి+ఇన) అహి = క్షుద్ర శత్రువులలో, ఇన + ప్రభువు లగు తమిధ్వజాది రాక్షసులను, దాన = కొట్టివేయుటయందు, నిరూఢ = తప్పిపోవని, ఉజ్జ్వల = వాఁడిగల, పత్రికుండు = బాణములు గలవాఁడు, అతఁడు = ఆదశరథుఁడు, సన్మాన్యుండు గాక, యల్పుఁడా! కాడనుట. “అహిర్వృత్రే క్షుద్రశత్రౌ" అనియు, “ఇనస్సూర్యే ప్రథౌ" అనియు నమరము.


తా.

ఆదశరథుఁడు పూర్వము తన సూర్యవంశస్థు లైనరాజులందఱికంటె మంచివాఁడను పేరును సంపాదించినాఁడు. శిష్టరక్షణమునందు నిపుణుఁడు.


లక్ష్మణ.

తన భాస్వత్కులమందు = తన ప్రకాశించెడు వంశమందు, ఆద్యు లగు= ఆద్యులైన, మేధాశాలిసద్రాజులందునను - మేధా = బుద్ధిచే, శాలి = ప్రకాశించినవారు అయిన, సద్రాజులందునను = (సత్ + రాజు = సజ్జనసముదాయము) సత్పురుషపంక్తులయందు, రాజన్ శబ్దమురకు “ఊద్బహుత్వే" యనుసూత్రముచే నుత్వము. ప్రబలుం డితం డని, ఇనుల్, స్తోత్రంబు సేయంగ, నెందు, నెసంగున్, మహిదేవ ... పత్త్రికుండు - మహిదేవలోక = బ్రాహ్మణనముదాయమునకు, పటుచేతోహర్షదా = సమర్థమైన మనస్సంతోషమును గావించెను, అహీన = తక్కువ కాని, దాన = దానములయందు, నిరూఢ = రూఢము చేయు, ఉజ్జ్వల = స్పష్టమయిన, పత్త్రికుడు = దానపత్రములు గలవాఁడు, అతఁడు = ఆమంత్రి, సన్మాన్యుండు గాక, యల్పుఁడే!


తా.

ఆగోపాలమంత్రి తనపూర్వులకంటె బుద్దిమంతుఁ డను పేరు
పడసెను. బ్రాహ్మణులకు భూదానాదిదానములు చేయుచుండెను.


ఆ.

సరభసముగఁ బూని పరులజీవనములు
పిండి ప్రోలివారి నిండువేడ్క
నొందఁ జేసె నాతఁ డుదయించినది మొద
ల్గాఁగ నతని నెన్నఁగా వశంబె.

5


రాఘవ.

అతఁడు, ఉదయించినది మొదల్గాఁగన్ = పుట్టినది మొదలుకొని, సరభసముగ = వేగముతో, పూని = పట్టుపట్టి, పరులజీవనములు = శత్రు.