పుట:Lanka-Vijayamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19


ఆ.

తత్పురమున నియతి దశరథకుంభినీ
పతి భటాళ్వ ముఖ్య బలచయా స్త్రీ
దిగు మహిపతి సమితిఁ దన పేరు వెలయ గో
సాలమం త్రి బుద్ధిపటిమ ననురు.

2


రాఘవ.

తత్పురమున = ఆయయోధ్యాపట్టణమున, నియతి = నియమమున, దశరథకుంభినీపతి = దశరథహారాజు, భటాశ్వముఖ్యబలచయాప్తిఁ దగు మహిపతిసమితిన్ = చతురంగబలయుతరాజసముదాయమునందు, తనపేరు వెలయన్ = తనపేరు ప్రసిద్ధి కెక్కునట్లు, గోపాలమంత్రి బుద్ధిపటిమన్ - గోపాల = ఇంద్రునియొక్క, మంత్రి = బృహస్పతియుక్క, బుద్ధిపటిమన్ = బుద్ధిపటిమవంటి బుద్దిపటిమచేతను, “స్వర్గేషు పశు వాగ్వఙ్రిదిఙ్నీత్రఘృణిభూజలే, లక్ష్యద్రుష్ట్యోస్త్రియాం పుంసి గౌః" అని యమరము. అమరును.


తా.

ఆపట్టణములో దశరథుఁడను రాజు గలడు. బుద్ధికి బృహస్పతివంటివాడు. చతురంగబలము కలవాడు.


లక్ష్మణ.

తత్పురమున = ఆ కుయ్యేటియందు, నియతిదశ = నియమావస్థచే, రథకుంభినీపతిభటాశ్వముఖ్యబలచయాప్తిన్ = రథములు, , పురుషగజములు (మగయేనుఁగులు), భటులు, ఆశ్వములు మొదలగు బలసముదాయముచేతను, తగు ఒప్పునట్టి మహిపతి = మహిపతిరావుయొక్క, సమితిన్ = సభయందు, తనపేరు వెలయ, గోపాలమంత్రి = గోపాలుఁడను నియోగి, బుద్ధిపటిమన్ = అతిశయ మైన బుద్ధిగలిగి, అమరున్


తా.

కుయ్యేరను గ్రామము, మహిపతిరా వనునధికారిసభలో గోపాలమంత్రి యను బ్రాహ్మణుఁడు గలఁడు.


క.

ఎన్న మహాభోగరమా
భ్యున్నతి దనుజారిపిండిప్రోలివిభుఁ డనన్
సన్నయుఁ డాగోపాలుఁడు
వన్నెయు వాసియును గల్గి వర్తిలె ధరలోన్.

3