పుట:Lanka-Vijayamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

లంకావిజయము


తా.

జనులకు సౌఖ్యకరమయినది, సంపదలచే నొప్పునట్టిది, విబుధులు గలిగి స్వర్గముం బోలినది యయోధ్యయను పట్టణ ముండెను.


లక్ష్మణ.

సకలలోకసమితి - సకల = విద్యలతోఁ గూడుకొనిన, లోక = జనమునకు, సమితి = సభాస్థాన మైన, “సంఘే సభాయాం సమితిః" అని యమరము. కుయ్యేరు=కుయ్యేరను గ్రామము, ఈతిరహితముగను = ఈతిబాధలు లేరీతిని, “అతివృష్టి రనావృష్టి ర్మూషికా శ్శలభా శ్శుకాః, అత్యాసన్నాశ్చరాజానః షడేతే ఈతిబాధయః" సిరికి = సంపత్తికి, లక్ష్మికి, ఇరవును = నివాసస్థానమును, విబుధవిలసితంబును = పండితులచేఁ బ్రకాశింపఁజేయబడినదియు (విబుధశబ్దమున దేవతలనియైన జెప్పవచ్చును), అగుచు, విపులన్ = భూమియందు “విపులాగహ్వరీ ధాత్రీ” యని యమరము. విపుల శబ్దములోని దీర్ఘ మునకు, ఆం. శ. చిం. “దీర్ఘాణాం హ్రస్వస్యాత్” అను సూత్రముచే హ్రస్వ మైన - ప్రథమమీఁది - ఆం. శ. చిం. “కూర్చిలను నయో భవేద్ద్వితయ్యాతు” అనుసూత్రముచే సుకారము రాఁగా ఆం. శ. చిం. "బిందుం ప్రవదంతి తం క్వచిత్కేచిత్” అను సూత్రముచే బిందువు రాఁగా, “ఇతరత్రచద్వితీయా" అనుసూత్రముచే సప్తమ్యర్థము వచ్చినవి.) పయోధ్యయను - పయోధి = సముద్రము, ఆయను = స్థానముగాఁ గల విష్ణువుయొక్క, పా “ఇకోయణచి" యనుసూత్రము ఇచ్చట “పరుషాద్ద్రుతప్రకృతికా త్సరళాస్యుః"అను ఆం.శ.చిం. సూత్రముచేఁ బత్వము వచ్చినది. పయోధ్యయను, అను ద్వితీయకు “షష్ఠీభవేద్ద్వితీయాతుల్యా” అనుసూత్రమువలన షష్ఠ్యర్థము వచ్చినది. నగరము = వైకుంఠము (పయోధ్యయను నగరము = వైకుంఠము), “నిరమో మహతాం లుక్చస్యాత్"అను సూత్రముచే నుకారలోపము, సురపురినిః = స్వర్గపట్టణమును, అనుకరించి = పోలి, అమరు = ప్రసిద్ధమగును.


తా.

పండితులు గలిగినది, ఈతిబాధలు లేనిది, సిరిసంపదలు గలది, వైకుంఠమును స్వర్గమును మించినది కుయ్యే రను గ్రామము గలదు.