పుట:Lanka-Vijayamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XV

గలదనియుఁ బై విమర్శనము నభిప్రాయము. అంతీయ కాని లక్ష్మణకవియందు వేఱభిప్రాయ మేదియును గాదు. శ్లేషమార్గమును విస్తరింపజేసిన యీతండును భాష కొకయుపకారము గావించినాఁ డనుట నిర్వివాదము.

ఈగ్రంథ మిదివఱకు 1877 సంవత్సరమునఁ గాకినాడలో ముద్రింపబడినది. ఆముద్రణము తప్పులతో నిండి యుండుటయే కాక యప్పటి పుస్తకములు లోకములో విశేషముగా వ్యాపించినట్లు గానరాదు. కావున దానిని వ్యయప్రయాసమున కోర్చి సాధ్యమయినంతవఱకు నిర్దుష్టముగా ముద్రించితిమి. వ్యాఖ్యానమును సుబోధక మగునట్లుగా కొంచెము సవరింపబడినది. సంగ్రహముగా భావమును వ్రాయఁబడినది. అయిన నెందయిన ముద్రణ లోపము లుండవచ్చును. అట్టివానికి బునర్ముద్రణమున సవరించికొనఁగలము. ఆంధ్ర భాషాభిమానుల ప్రోత్సాహముచే నీ గ్రంథము విశేషవ్యాప్తిని జెందును గాక యని కోరుచున్నారము.