పుట:KutunbaniyantranaPaddathulu.djvu/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 92

డయాఫ్రం పర్సులో దాచుకున్నా, అలమారా సొరుగులొ పెట్టినా ఏమీ చెడిపోదు. డయాఫ్రం పద్ధతి ఫేల్ అవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. డయాఫ్రంని సరిగ్గా ఫిట్ చేసుకోవడం చేతకాకపోయినా, సంయోగం సమయంలో యోనిమార్గం ఎక్కువ వెడల్పు అయినా, డయాఫ్రం అంచులకి జెల్లీ వ్రాస్తే ఆ అంచులు జారిపోయినా అసలు జెల్లీ రాయకుండా డయాఫ్రం ఉపయోగించినా గర్భనిరోధం జగకపోవచ్చు కొన్ని సంయోగ పద్ధతుల వల్ల కూడా డయాఫ్రం జారిపోవచ్చు. ముఖ్యంగా భర్త క్రింద పరుండి, భార్య అధిరోహించే పద్ధతివలన డయాఫ్రం ఉండవలసిన పొజిషన్ నుంచి తొలగవచ్చు. ఏది ఏమైనా డయాఫ్రం పద్ధతి చాలా తేలిక, తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

* * *