పుట:KutunbaniyantranaPaddathulu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 89

గుర్తించే విధంగా నేర్పవలసి ఉంటుంది. ఇలా నేర్పిన తరువాత డాక్టరు ప్రయోగత్మకంగా ఒక డయాఫ్రంని యోనిమార్గం గుండా ప్రవేశపెట్టి ఆ స్త్రీ చేత దానిని పూర్తిగా గుర్తించేటట్లు చేసి తిరిగి బయటకు యెలా తీయాలో నేర్పుతారు. ఇక దీని తరువాత ఆ స్త్రీ తనంతట తాను డయాఫ్రం యోని మార్గం లోపల సంయోగానికి ముందు ఫిట్ చేసుకుంటుంది. డయాఫ్రంని లోపల ఫిట్ చేసుకోవడానికి ముందు దానిపైన వీర్యకణాలని నిర్మూలించే జెల్లీ వ్రాసి, ఆ డయాఫ్రం అంచులని రెండు వ్రేళ్ళతో అదిమిపట్టి నొక్కితే, కప్పలాగా కనబడే డయాఫ్రం దొప్పలాగా పొడుగుగా మారుతుంది. ఇలా వ్రేళ్ళతో నొక్కి పట్టుకొని యోని మార్గంలోకి లోపలికల్లా దూర్చి ముందుబాగం గర్భాశయ కంఠం క్రిందకు చేర్చితే పైభాగం గర్భాశయ కంఠానికి ముందు ఉండే బస్థి ఎముకకు ఫిట్ అవుతుంది. ఆ విధంగా గర్భాశయ కంఠాన్ని డయాఫ్రం మూసి వేస్తుంది. డయాఫ్రం ఉపయోగించే పద్దతి ముందు డాక్టరు ద్వారా నేర్చుకోవలసిందే కాని స్వయంగా తెలుసుకోవడం కష్టం ఒకవేళ స్వయంగా ప్రయత్నించినా అది సక్రమంగా ఫిట్ అవడం జరగదు.

డయాఫ్రం - కొన్ని విశేషాలు

డయాఫ్రం ఉపయోగించడం తెలుసుకుంటే చాలా తేలికగా గర్భాశయ కంఠం దగ్గర ఫిట్ చేసుకోవచ్చు. డయా