పుట:KutunbaniyantranaPaddathulu.djvu/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాల్ట్‌కాప్ డయాఫ్రంలు ఐదు సైజుల్లో తయారు చేయబడి ఉంటాయి. ఇటువంటి డయాఫ్రంలు కూడా మన దేశంలో వాడటం లేదు.

సెర్వయిస్‌ల్ కాప్ డయాఫ్రంలు కూడా మనదేశంలో వాడటానికి స్త్రీలు ఉత్సుకత చూపించడం లేదు. వీటిని లోపల పెట్టుకోవడం కాస్త ఇబ్బందికరమైన టెక్నిక్ కనుక స్త్రీలు వీటి ఎడల అంతగా ఆసక్తి చూపించడం లేదు.

విముల్ కాప్ అనేది సెర్వయికల్ కాప్ వాల్ట్ కాప్ రెండింటి సమ్మేళనం. ఇవి మూడు సైజుల్లో దొరుకుతాయి.

సంయోగంలో పాల్గొన్నా పాల్గొనకపోయినా కుటుంబనియంత్రణ మాత్ర అయితే మరచిపోకుండా రోజూ వేసుకోవాలి, డయాఫ్రం మాత్రం కేవలం సంయోగం చేసేటప్పుడే ఉపయోగించడం జరుగుతుంది. వీర్యకణాలని నిర్మూలించే జెల్లీ కూడా డయాఫ్రంతోజాటు కలిపి ఉపయోగించడం జరుగుతుంది. డయాఫ్రం - జెల్లీ పద్ధతి తేలిక కాబట్టి గర్భనిరోధక పద్ధతులలో చాలా ప్రచారం అయింది. డయాఫ్రం మెత్తని రబ్బరుతో తయారుచేయబడింది. డయాఫ్రం చిప్ప ఆకారంలోఉండి ఎలా కావాలంటే అలాముడవబడే విధంగా ఉంటుంది. దీని అంచు లోహంతో కూడిన స్ప్రింగుతో చేయబడి ఉంటుంది. అందుకని దీనిని గర్భాశయ కంఠానికి తగిలించి పెట్టినపుడు అక్కడ జారి