పుట:KutunbaniyantranaPaddathulu.djvu/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 83

రక్షితకాలం, అరక్షితకాలం అనేది నెల నెలా సరిగ్గా బహిస్టు అయ్యే స్త్రీలోనే సక్రమంగా ఉంటుంది. అలా సరిగ్గా బహిస్టు కాని స్త్రీలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సారి అండం విడుదల అవుతుంది.

నెల నెలా సక్రమంగా ఒకే రోజుకి బహిస్టు కాని వారిలో బహిస్టు అయిన తొలి దినాలకంటే బహస్టు రావడానికి ముందు 11 రోజులు ఎక్కువ క్షేమకరం.

నెల నెలా ఎంత సక్రమంగా బహిస్టులు వచ్చే స్త్రీలో నైనా ఒక్కొక్కసారి అండం విడుదల మామూలు కంటే ముందుగానూ జరగవచ్చు. ఆలస్యంగానూ జరగవచ్చు. అటువంటప్పుడు రక్షితకాలంలో కూడా గర్భం రావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే రక్షిత కాలంలో పాల్గొన్నా పూర్తి రక్షణ కొరకు గర్భం రాకుండా ఫోమ్ బిల్లలు గాని, ఫోమ్ జెల్లీగాని వాడటం మంచిది.

* * *