పుట:KutunbaniyantranaPaddathulu.djvu/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 72

రతిలో పురుషాంగ ఉపసంహరణ

గర్భనిరోధక పద్ధతిగా రతిలో పురుషాంగ ఉపసంహరణని ఎంతో నైపుణ్యముతో నిర్వర్తించవలసి ఉంటుంది. స్త్రీ పురుషులు సంయోగములో పాల్గొన్నప్పుడు, పురుషునికి కామోద్రేకము చరమస్థాయికి చేరి వీర్యస్కలనం అయ్యే అనుభూతి కలగగానే పురుషాంగాన్ని యోనిలోనుంచి బయటకు తీసివేయడం ఈ పద్దతిలో జరిగే విశేషం. యోనిలోనుంచి పురుషాంగం ఉపసంహరించగానే యోని బయట వీర్యస్కలనం జరిగిపోతుంది. వీర్యస్కలనం యోని మార్గములో జరగదు. కనుక స్త్రీ గర్భవతి కావడం జరగదు. అయితే వీర్యస్కలనం ఏమాత్రం యోని మార్గంలో జరగకుండా పురుషాంగం పూర్తిగా ఉపసంహరించిన తరువాతే జరగడం ఎంతో ముఖ్యం. ఒకవేళ వీర్యస్కలనము యోనికి బయట అంతరాధరాలు, బాహ్యాధరాల మీద జరిగిన వీర్యకణాలు యోని మార్గంలోకి పయనించగల శక్తి కలిగి ఉంటాయి. కొందరి దృష్టిలో పూర్తిగా పురుషాంగం ప్రవేశం జరిగి వీర్య స్కలనమయితేనే గర్భము వస్తుంది, లేకపోతే రాదనే భావం ఉంది. అందుకని కొందరు యువతీ యువకులు అక్రమ కామ సంబంధాలలో కన్నెపొర చిరగకుండానే యోనిదగ్గర బాహ్యంగానే రతి జరిపి తృప్తిపడి గర్భము రాదని ధైర్యముగా ఉండిపోతారు. కాని యోని బయట