పుట:KutunbaniyantranaPaddathulu.djvu/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 52

విస్తరించి ఉంటుంది. కాపర్ -టి (Copper-T) లూప్ గర్భకోశంలో ప్రవేశపెట్టేటప్పుడు 'T ' తలభాగం గర్భకోశం పై వైపుకి, T క్రిందిభాగం గర్భకోశం క్రింది వైపుకి ఉండేటట్లు చూడడం జరుగుతుంది. అప్లికేటరు ద్వారా కాపర్-టి లూప్‌ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.

మల్టీలోడ్ సి యు 250 లూప్

KutunbaniyantranaPaddathulu.djvu

a) తేలికగా వంగే లూప్ భుజములు (Flexible plastic arms)

b) లూప్‌కి నిలువుగా ఉన్న ప్లాస్టిక్ భాగము దీనికి కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది

c) లూప్ చివర ముడివేయబడిన నైలాన్ దారాలు

మల్టీలోడ్ సి యు 250 లూప్‌ని ఆర్గనాన్ ఫార్మాస్యూటికల్ కంపనీ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. ఇది 3, 6 సెంటీ మీటర్లు పొడవు ఉండే ప్లాస్టిక్ సాధణం. దీనికి