పుట:KutunbaniyantranaPaddathulu.djvu/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 32

గుండె జబ్బు ఉన్నప్పుడు, శరీరంలొ కేన్సర్ ఉన్నప్పుడు గర్భనిరొధక మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఎందుకంటే ఆ మాత్రలలో ఉండే ఈస్ట్రొజను హర్మోను ఆ వ్యాధి ముదరడానికి లేదా తిరగబెట్టడానికి దోహదం చేస్తొంది. పై పరిస్థితుల్లోనే కాకుండా మధుమేహం ఉన్న వాళ్ళు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నవారు, గర్భాశయంలో ఫైబ్ర్రాయిడ్స్ ఉన్నవారు నోటి మాత్రలు వాడకూడదు.

గర్భనిరోధక మాత్రలు పాలు ఇస్తున్న తల్లులు వాడవచ్చా?

గర్భనిరోధక మాత్రల వల్ల తల్లి దగ్గర పాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అందుకని బిడ్ద ఆహారం తీసుకోవడం మొదలుపెట్టే వరకు తల్లి సంతాన నిరోధక మాత్రలు వేసుకోవడం మంచిదికాదు. బిడ్డకు పాలు ఇస్తున్న తల్లులు కనీసం ఆరవ నెలవరకు ఈ మాత్రలు వాడకుండా ఉండటం మంచిది. అయితే కుటుంబ నియంత్రణకి ఇతర పద్ధతులు అవలంబించవచ్చు.

కొన్ని సంతాన నిరోధక నోటి మాత్రలు

'ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ' నే నోటి మాత్రలు అని అంటారు. మర్కెట్టులో ప్రతీ మందుల షాపులోనూ, ప్రభుత్ఫంవారి కుటుంబనియంత్రణ విభాగంలోనూ ఈ క్రింది