పుట:KutunbaniyantranaPaddathulu.djvu/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 31

గర్బనిరోధక మాత్రలవల్ల కేన్సర్ వస్తుందా ?

30 సంవత్సరాల పైగా స్త్రీల వ్యాధులలో చాలా ఎక్కువ మోతాదులో ఈష్ట్రొజన్ హార్మోనును ఉపయోగించడము జరుగుతోంది. యీ రకంగా మందు రూపములో యీ హార్మోన్లు ఇవ్వగా కేన్సర్ వచ్చినట్లు ఎక్కడా రూఢి అవలేదు. కొందరు యీమాత్రలు వాడితే కేన్సర్ వస్తుందేమోనని ఆపోహ పడటానికి ఒక కారణం ఉంది. యీ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయ కంఠము దగ్గరవున్న టిస్యూలలో కేన్సర్ వచ్చినపుడు కనబడే మార్పులు కనబడటము జరుగుతుంది. స్త్రీ గర్బవతిగా వున్నప్పుడు కూడా అక్కడి టిస్యూలలో ఇటువంటి కేన్సర్ లక్షణాలే కనబడి, కాన్పు అయిపోయిన తరువాత ఆ లక్షణాలన్నీ పోయి మామూలుగానే మారిపొతాయి. అదే విధంగా మాత్రలు వాడుతున్నంతకాలము కనబడి, ఆ మాత్రలు మానివేయగానే ఆ లక్షణాలు లేకుండా పోతాయి. ఇంకో రకంగా చూస్తే అసలు ఈ మాత్రలు గర్భాశయానికి, వక్షోజాలకు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.

కొందరికి నిషేధింపబడిన మాత్ర

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్నప్పడు ఊప్రితిత్తుల్లో రక్తం గడ్డకట్టి అడ్దు పడినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు, కళ్ళనరాల్లో రక్తప్రసారం ఆగిపొయినపుడు