పుట:KutunbaniyantranaPaddathulu.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 212

స్రావ పద్దతి అని భావిస్తాడో ఆ పద్దతి ప్రకారము గర్భస్రావము చేయవచ్చు. పెళ్ళి కాకుండా, కడుపు వచ్చిన వాళ్ళు, వితంతువులు కూడా గర్భస్రావము చేయించుకోవడానికి చట్టప్రకారం అర్హులు. అలాగే విదేశ స్త్రీలు తాత్కాలికముగా మనదేశం వచ్చి ఇక్కడ గర్బస్రావము చేయించుకోవడానికి అభ్యంతరం అడ్డంకు లేదు.

చట్టంలోని భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని డాక్టరు గర్భస్రావాన్ని చేయాలి. అలా కాకుండా చట్టంలోని విషయాలకి వ్యతిరేకంగా గర్భస్రావం చేసేటట్లయితే ఆ డాక్టరుకి జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుందని చట్టంలో రాయబడింది.

* * *