పుట:KutunbaniyantranaPaddathulu.djvu/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 211

గర్భస్రావం - మరికొన్ని వివరణలు

ఒక స్త్రీకి చట్టము ప్రకారము ఎన్నిసార్లు గర్భస్రావము చేయడానికి అవకాశము వుందని సందేహము కలగవచ్చు. చట్టంలో ఇన్నిసార్లు మాత్రమే గర్భస్తావం చేయాలని హద్దు పెట్టలేదు. ఆమెకు వచ్చిన మానసిక, శారీరక పరిస్థితినిబట్టి ఎన్ని సార్లు అయినా గర్భస్రావం చేయవచ్చు.

గర్భస్రావం చేసిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకోమని స్త్రీని ఒత్తిడి చేయటానికి చట్టం ప్రకారం అవకాశం లేదు.

కొన్ని స్సందర్భాలలో చట్టం ప్రకారం స్త్రీకి గర్భస్రావము చేయించుకోవడానికి అర్హత ఉన్నా గర్భస్రావం చేయడానికి తగిన ఆరోగ్య పరిస్థితి లేకపోతే డాక్టరు గర్భస్రావం చేయడానికి నిరాకరించవచ్చు. కాని దానికి తగిన కారణాలు డాక్టరు చూపించాలి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మత సంబంధంగా ఏ డాక్టరు గర్భస్రావం చేయడానికి నిరాకరించరాదు. అలా చేసిన పక్షంలో స్టేట్ మెడికల్ రిజిష్టరు నుంచి ఆ డాక్టరు పేరు తీసివేయడం, గుర్తింపు రద్దు చేయడము జరుగుతుంది.

చట్టం ప్రకారముగా ఒక నిర్ధిష్టమైన గర్భస్రావ పద్దతిని చేయాలని అనలేదు. డాక్టరు ఏది సక్రమమైన గర్భ