పుట:KutunbaniyantranaPaddathulu.djvu/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 210

డానికి చట్టము ప్రకారము ఇద్దరు డాక్టర్లు కలిసి నిర్ణయము తీసుకోవాలి. అయిదు నెలలుదాటిన గర్భిణీ స్త్రీకి గర్భస్రావం చేయబడదు. కాని కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అయిదు నెలలు తరువాత కూడా గర్భస్రావము చేయడానికి చట్టము అంగీకరించింది.

గర్భస్రావము చేయడానికి ముందు డాక్టరు ఆ స్త్రీ అంగీకారము తీసుకోవాలి. ఆమెకు గర్భస్రావము చేయడానికి భర్త అంగీకారము అవసరంలేదు. స్త్రీ ఒప్పుకుని, ఆమె భర్త ఒప్పుకొనకపోయినా గర్భస్రావము చేయవచ్చు. ఒక వేళ ఆ స్త్రీ మైనరు అయినా, పిచ్చిది అయినా భర్త గార్డియన్ అనుమతి కావాలి.

అనుమతి పొందిన ఏ ప్రైవేట్ నర్సింగు హోమ్‌లో అయినా, గవర్నమెంటు హాస్పిటల్‌లో అయినా గర్భస్రావాన్ని చేయించుకోవచ్చు. గర్భస్రావము చేయడానికి కావలసిన శిక్షణ ఇవ్వడానికి చట్టంలోఅవకాశం నిర్దేశింపబడి ఉంది. అందుకని శిక్షణ నిపుణత వున్న డాక్టర్ల ద్వారానే గర్భస్రావము చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను గర్భస్రావము చేయించుకున్న స్త్రీ పేరు బయట పెట్టబడదు. హాస్పిటల్‌లో ఒకే ఒక రిజిష్టరులో వారి పేరు వ్రాయబడి వుంటుంది. ఇక తక్కిన వాటన్నింటి మీద కోడ్ నంబరు మాత్రమే వాడబడుతుంచి. చివరికి కేస్ షీట్ మీద కూడా పేరు వ్రాయబడదు.