పుట:KutunbaniyantranaPaddathulu.djvu/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 21

చేయించుకున్న వాళ్ళల్లో ఆ సమస్యే ఉండదు. నిరోధ్ తొడుగుతున్నప్పుడు చేతి గోళ్ళుకాని, వేళ్ళకు ఉండే ఉంగరాలుకాని గీసుకుపోకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే ఆ తెగిన స్థలంనుంచి వీర్యం లీక్ అవడానికి ఆస్కారం వుంటుంది. నిరోధ్‌ని పురుషాంగానికి చివరికల్లా తొడిగి ఇలా స్టిక్ రింగ్ గట్టిగా పట్టుకొనేటట్లు చూడాలి. నిరోధ్ వాడుతున్నప్పుడు పురుషాంగంనుంచి వెలువడే ద్రవాలు బయటకురావు కనుక అంతా పొడిగా వుంటుంది. అటువంటప్పుడు స్త్రీ యోనిమార్గం కూడా సరిగ్గా ద్రవాలు వూరక పొడిగ ఉంటే అటువంటి దంపతులలో సంయోగం సరిగ్గా కుదరదు. పైగా బాధాకరంగా వుంటుంది. ఇటువంటప్పుడు కుటుంబ నియంత్రణ కుపయోగించే పేస్టులు, జెల్లీలు నొరోధ్ పైన రాయాలి. అప్పుడు తేలికగా సంయోగం కుదురుతుంది. జారుడు పదార్ధంగా వేజలైను వ్రాయకూడదు, వేజలైను లాంటివి నిరోధ్ రబ్బరుని పాడుచేస్తాయి.

పురుషాంగం బాగా స్తంభించి ఉన్నప్పుడు నిరోధ్ బాగానే పట్టుకుని ఉండి జారిఫోకుండా ఉంటుంది. అలా కాక వీర్యం స్థలనం అయిన తరువాతగాని, సంయోగం సమయంలో ఇతర కారణాలవల్లకాని పురుషాంగం పరిమాణం తగ్గిపోతే, నిరోధ్ జారిపోయి యోనిమార్గంలో ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకని నిరోధ్ వాడేటప్పుడు పురుషాంగ పరిమాణం తగ్గకముందే రతినుండి ఉపసంహరించాలి.