పుట:KutunbaniyantranaPaddathulu.djvu/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 164

ఇప్పుడు ఇటువంటి బిళ్ళలు ఇంజక్షన్లతో పని లేకుండా క్షేమకర పద్దతుల వల్లనే గర్భం వచ్చినదీ లేనిదీ తెలుసు కోవడానికి అవకాశం కలుగుతుంది.

నెల తప్పిన స్త్రీ మూత్రం పరీక్ష

గర్భం అయినదీ కానిదీ తెలుసుకోవడానికి ఈనాడు బిళ్ళలు మ్రింగనవసరం లేదు, ఇంజక్షన్ లు చేయించుకోనవసరం లేదు. అంతే కాదు వారం - పది రోజులపాటు వేచిచూడనవసరం లేదు. నెల తప్పిన రోజు నుంచే ఆ స్త్రీ మూత్రం కొద్ది చుక్కలు పరీక్ష చేస్తే చాలు, రెండు నిముషాల్లోనే ఆమెకు గర్భం వచ్చినదీ లేనిదీ నిర్ధారణ అయి పోతుంది. ఇది ఎలా సంభవమని ఆశ్చర్యం కలగవచ్చు. కాని ఇది సైన్సు సాధించిన విజయం.

అండంతో వీర్యకణం కలయిక పొందిన 24 గంటల్లో హ్యూమన్ కోరియానికి గోనాడో ట్రాసిన్ హార్మోను ఉత్పత్తి మొదలవుతుంది. అలా తయారైన హార్మోను మూత్రంద్వారా విడుదల అవుతుంది. ఈ హార్మోను గర్భం దాల్చని స్త్రీలలో తయారవడం, మూత్రం ద్వారా విడుదల అవడం ఉండదు అందుకని అతి సున్నితమైన పరీక్షావిధానం ద్వారా కొద్దిచుక్కలు మాత్రమే మూత్రం తీసుకుని పరీక్ష చేసి ఆ హార్మోను తయారు అవుతున్నదీ లేనిదీ తెలుకుకోవడం జరుగుతుంది.