పుట:KutunbaniyantranaPaddathulu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 163

బడకపోతే గర్భం అని నిర్ధారణ అయిపోయేది. గర్భం ఉంటే ఒకటికి పది బిళ్ళలు వేసుకున్నా గర్భం పోవడంగాని, బహిష్టు స్రావం కనబడటం జరగదు. ఇది ఒక రకంగా చాలా తేలికైన పద్ధతే అయినా గర్భం అవునా, కదా తెలుసుకోవడానికి వాడే ఈ మందు బిళ్ళలవల్ల ఇంజక్షన్‌ల వల్ల నిజంగానే గర్భం వచ్చి ఉన్నట్లయితే గర్బస్థ శిశువు మీద దుష్పలితాలు కనబడే అవకాశం ఉంది. అందరు శిశువులమీద వీటిదుష్పలితాలు కనబడకపోయినా, నూటికో - కోటికో ఒకరి మీద కనపడినా కూడా తప్పే కదా. అందుకని డ్యుయోగైనాన్ వంటి బిళ్ళ్లని, ఇంజక్షన్లని గర్భం అవునా, కాదాఅని తెలుసుకోవటానికి ఉపయోగించడాన్ని వైద్యశాస్త్రజ్ఞులు ఒప్పుకోలేదు. ఒకవేళ గర్భం అవునా, కాదా అని తెలుసుకోవడానికి వాడితే, దానివల్ల గర్భం ఉందని తేలితే, ఆ గర్భాన్ని ఉంచుకోకుండా అబార్షను చేయించుకోవాలని వైద్యశాస్త్రజ్ఞులు సలహా ఇచ్చారు. ఎందుకంటే ఈ మందులు వాడడంవల్ల పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంతో పుట్టుతాడో, పుట్టడో చెప్పడం కుదరదు కనుక, కీడు ఎంచి మేలుకోసం అబార్షను చేసివేయడం అవసరం అని అభీప్రాయం వ్యక్తపరిచారు. అందుకని గర్భం అయితే అబార్షను చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటేనే ఈ గర్భధారణ మందులు వాడాలని సలహా ఇచ్చారు.

వైద్యశాస్త్రం బాగా అభివృద్ది సాధించడంతో