పుట:KutunbaniyantranaPaddathulu.djvu/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. గర్భం వచ్చినట్లు తెలుసుకోవడం

కొందరికి అప్పుడే పిల్లలు వద్దనిపిస్తుంది. కాని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోరు. దానితో నెల తప్పడమవుతుంది. ఇక అప్పటినుంచి కంగారు మొదలవుతుంది. ముందు అసలు అది గర్భం రావడమా, బహిస్టులు రావడం ఆలశ్యం అవడమా అనే అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యంగా లూప్ వేయించుకున్న వారిలోనూ, 'టుడే ' వెజైనల్ టాబ్లెట్లు వాడేవారిలోనూ, ఫోమ్, జెల్లీలు వాడే వారిలోనూ నెలసరి రాకపొయేసరికి ఇటువంటి అనుమానం కలగడం మరింత ఎక్కువ.

పూర్వకాలమైతే గర్భిణీ అవునా కాదా అని తెలుసుకోవడానికి డ్యూయోగైనాన్, సైక్లోనార్మ్ వంటి బిళ్ళలు, ఇంజక్షన్లు వాడేవారు. ఆ బిళ్ళలు రెండు వేసుకున్నా, రెండు ఇంజక్షన్ లు చేయించుకున్నా గర్భం అయినదీ లేనిదీ తేలిపోయేది. ఎలాగంటే ఈ మందులు వాడిన వారంరోజుల్లో బహిస్టు స్తావం కనబడితే గర్భం కానట్టు తేలిపోయేది. కేవలం ఏదో కారణాలవల్ల బహిష్టు రాలేదు కాని గర్భం రావడం వల్ల కాదని నిర్ధారణ అయ్యేది. అదే మందులు వాడిన వారం పది రోజుల్లో బహిష్టు స్తావం కన