పుట:KutunbaniyantranaPaddathulu.djvu/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 161

'స్రీల నిరోధ్‌' విజయవంతమైనట్లయితే స్త్రీలు కుటుంబనియంత్రణ కొరకు బిళ్ళలు మింగడంగాని, యోనిలో టాబ్లెట్లు వాడడంగాని అవసరం ఉండదు. పైగా పురుషుడు సరిగ్గా నిరోధ్ వాడకపోతే తనకి ఎక్కడ గర్భం వస్తుందో అని ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. తన భద్రత గురించి తానే జాగ్రత్తపడి హాయిగా దాంపత్య సంబంధాలలో పాల్తొనవచ్చు.

* * *