పుట:KutunbaniyantranaPaddathulu.djvu/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 160

స్త్రీలకోసం రూపొందించబడిన ఈ నిరోధ్ గర్భం రాకుండా నిరోధించడమే కాకుండా, పురుషునికి ఏమైనా సెక్స్ వ్యాధులు ఉంటే ఆమెకు సంక్రమించకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే పురుషులు సంయోగంలో పాల్గొన్నా అతని పురుషాంగం తిన్నగా ఆమె యోని గోడలతో సంబంధం పొందదు. కేవలం యోని లోపల అమరిన పల్చని రబ్బరు గొట్టంతోనే ఉరుషాంగం ప్రవేశిస్తుంది. వీర్యస్కలనం కూడా ఆ తొడుగులోనే జరుగుతుంది. అలా స్కలింపబడిన వీర్యం ఆ తొడుగులోనే ఉండిపోతుంది. సంయోగం అయిపోయిన తరువాత ఆ తోడుగుని యోనినుండి లాగివేసి బయట పారవేయడమే స్త్రీ చేయవలసిన పని.

స్త్రీలకి రూపొదించబడిన విరోధ్‌వల్ల పురుషుల నుంచి స్త్రీలకిగాని, స్త్రీల నుంచి పురుషులకి గాని ఎయిడ్స్‌వంటి వ్యాధులుగాని, ఇతర ప్రమాదకర వ్యాధులుగాని సంక్రమించడం ఉండదు.

స్త్రీల కోసం రూపొందించబడిన నిరోధ్ వాడకం గురించి, దాని సాధకబాధకాల గురించి ఇప్పుడు ఇంగ్లండులో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతవరకు జరిగిన ప్రయోగాలనుబట్టి దీని వాడకంవల్ల స్త్రీకిగాని, పురుషునికిగాని ఎటువంటి అసౌకర్యంగాని, అసంతృప్తిగాని కలగడం లేదని తేలింది. పైగా దంపతులు, అందులోనూ ముఖ్యంగా స్త్రీలు దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు.