పుట:KutunbaniyantranaPaddathulu.djvu/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 155

షను అవడం, అవకపోవడంతో సంబంధం లేకుండా కొంత వయస్సు వచ్చేసరికి శరీర ధర్మంలో మార్పులు వచ్చి ఒళ్ళు చేయవచ్చు. ఒకవేళ ఈ మార్పు ఆపరేషను చేయించుకున్న దినాలలో జరిగినట్లయితే ఆపరేషనువలన జరిగిందని దానికి ఆపాదించడం జరుగుతుంది. ఇలాంటి మార్పు కావాలని ఆశించిన వాళ్ళు రెండూ ఒకేసారి తటస్థ పడితే సంతోషిస్తారు. మరికొందరు అయితే ఆపరేషను వలన వచ్చిందని తమలో తాము నిందించుకుంటారు.

* * *