పుట:KutunbaniyantranaPaddathulu.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 153

క్టమీ ఆపరేషను చేయించుకున్న తరువాత బలం కోసం వేరే ఏమీ తిననవసరం లేదు. అలాగే ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోనవసరం లేదు. కాని ఈ విషయం తెలియక చాలా మంది స్త్రీలు నెలల తరబడి పని మానివేయడం, అనవసరంగా ఎక్కువ తినడం చేస్తారు.

కాన్పులైన స్రీలలో తెల్లబట్ట ఎందుకని !

కాన్పులప్పుడు గర్భాశయ కంఠం దగ్గర ఒత్తిడి కలిగి చీరుకుని పోవడమో, గాయమవడమో సాధారణమైన విషయం. ఇలా కాన్పుల వలన గాయమైన గర్భాశయ కంఠం (నెర్వెక్స్) వెంటనే మానిపోక పొతే యోని మార్గంగుండా బాక్టీరియూ క్రిములు గర్భాశయ కంఠానికి చేరి అక్కడ స్థానమేర్పరచుకుంటాయు. ఒకసారి గర్భాశయ కంఠంలోకి బాక్టీరియా క్రిములు ప్రవేవేశించిన తరువాత వెంటనే పూర్తి చికిత్స చేయకపొతే గర్భాశాయకంఠం ముందు ఎర్రటి పూతగా కనబడి తరువాత పుండుగా కనబడుతుంది అప్పుడు సాధారణంగా వాడే మందులు యోని మార్గంలోకి జొప్పించి వాడే బిళ్ళలు వలన ఫలితం అంతగా కనబడదు. ఒకవేళ ఉపశాంతి కనబడినా చాలా మందిలో తాత్కాలికంగానే ఉంటుంది. కొందరికి ఈ పుండుని కరెంటుతో మాడ్చినా తిరిగి రావడానికి ఆస్కారం ఉంది.