పుట:KutunbaniyantranaPaddathulu.djvu/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 152

పోయినా తగ్గిపోకుండా ఉండిపోయి నడుమునొప్పిని కలిగిస్తూనే ఉంటాయి. వాటికి చికిత్స పొందకుండా ఉండి ట్యూబెక్టమీ చేయుంచుకుంటే దానివలన వచ్చిందనీ, ఇక ఏమి చేసినా ఫలితం లేదని భావించి భాధపడుతూ అజ్ఞానంతో ఊరుకుంటారు. కాని డాక్టరుకి చూపించి అసలు కారణానికి చికిత్స పొందినట్లయుతే ట్యూబెక్టమీ గురించి కలిగించుకున్న ఆపోహలుపోతాయి

ట్యూబెక్టమీ వల్ల ఒళ్లు వస్తుందా?

చాలామంది స్త్రీలు ట్యూబెక్టమీ ఆపరేషను చేయించుకుంటే పొట్టపెరుగుతుందనీ, ఒళ్ళు వస్తుందని భయపడుతూ ఉంటారు. ట్యూబెక్టమీ చేయించుకుంటే ఒళ్ళు రావడం జరగదు. ఎవరికైనా ఆపరేషను చేయించుకున్న తరువాత ఒళ్ళు వచ్చిందంటే, ఆపరేషను చేయించుకున్నాం కదా, బలంగా తినాలని, మీగడ పెరుగులు, నేతి గారెలు తినడం వల్లనో, పనీ పాటా చేయకుండా నెలల తరబడి విశ్రాంతి తీసుకోవడం వల్లనో రావడం జరుగుతుంది.గాని ఆపరేషను వల్ల కానే కాదు. అందుకని అనవసరంగా అతిగా తినడం నెలల తరబడి విశ్రాంతి తీసుకోవడం పనికిరాదు. ఆపరేషను చేయించుకున్న వారే కాదు, మామూలువారు కూడా పనీపాటా లేకుండా కూర్చుని అదేపనిగా తినడం చేస్తే వాళ్ళకి కూడా ఒళ్ళు వస్తుంది.అసలు ట్యూబె