పుట:KutunbaniyantranaPaddathulu.djvu/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 151

కొందరు స్త్రీలల్లో కాన్పులవల్ల గర్భాశయము ఉండవలసిన పొజిషన్‌లో వుండకుండా వెనుకకు వాలిపోతుంది. ఇలా వెనుకకు గర్భాశయం వాలిపోవడానికి కారణము దానిని పొనిషన్‌లో నిలబెట్టి ఉండే లిగమెంట్లు గర్భము పెరగడమువలన సాగిపోయి సహజశక్తిని కోల్పోవడమే. అలా వెనుకకు పడిపోయిన గర్భాశయము వలన నడుమునొప్పి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జరిగిన అందరి స్త్రీలలో నడుము నొప్పి ఉండాలని లేదు. అధికశాతము స్త్రీలలో మాత్రము నడుమునొప్పి కనబడుతుంది. మరికొందరి స్త్రీలలో కాన్పు సందర్భములో గర్భాశయము యోని మార్గముగుండా బయటకు కాస్త జారుతుంది. అలా జారబట్టికూడా నడుమునొప్పి తరచు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా జరగడమువలన వచ్చే నడుమునొప్పిని దానివలనని అర్ధము చేసుకోలేక ట్యూబెక్టమీ చేయించుకుంటే దాని వలనని భావిస్తారు.

కొందరు స్త్రీలకి ఇంటిదగ్గర కాన్పులు అవడమువలన శుభ్రత సరిగ్గా పాటించక పోవడమువలన బాక్టీరియా క్రిములు గర్భాశయానికి. అండవాహికల్లోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. దానివలన తరచు నడమునొప్పి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు మూత్రకోశ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు కలగడం సాధారణమైన విషయం. ఈ వ్యాధులు కాన్పు అయి