పుట:KutunbaniyantranaPaddathulu.djvu/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 147

ట్యూబెక్టమీ వల్ల నడుమునొప్పి వస్తుందా?

"డాక్తర్, మీరు కాదని అంటారుగాని ట్యూబెక్టమీచేయించుకున్న తరువాత నాకు వెన్ను నొప్పి వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఏమంటారు?" అని ప్రశ్నించింది ప్రసన్న. ప్రసన్న ప్రసవించగానే మళ్ళీ కడుపు రాకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. ఇప్పుడు నడుం నొప్పి వస్తూ వుంటే, ఆ నడుమునొప్పి ఆపరేషను వల్ల నేనని ఆమ ఆపోహ పడటంలో తప్పులేదు. అయితే నడుము నొప్పి రావడంలో అసలు కారణాన్ని వివరించి చెప్పడంలో డాక్టరు బాధ్యత యెంతో ఉంది. ట్యూబెక్టమీ వలన నడుము నొప్పి ఏమీ రాదులే అని ఆమె మాటని త్రోసి పెట్టేసి ఊరుకుంటే బాధ బాధగానె ఉండిపోయి అపోహ తొలగకుండానే ఉండిపోతుంది.

వాస్తవానికి ట్యూబెక్టమీ వల్ల నడుం నొప్పి రానే రాదు. ట్యూబెక్టమీ చేయించుకున్న ఎందరో స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా హాయిగా ఉన్నారు. అయితే కొందరు స్త్రీలలో ఆపరేషను చేయించుకున్న తరువాత నడుమునొప్పి కనిపిస్తూ ఉంటుంది ఎందకని? అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఇలా నడుమునొప్పి కెవలం ట్యూబెక్టమీ చేయించుకున్న స్రీలలోనే కాదు. చేయించుకోనటువంటి స్రీలలో కూడా కనబడుతుంది. మరి ఆపరేషను చేయించుకోకపోయినా వారిలో నడుమునొప్పి ఎందు