పుట:KutunbaniyantranaPaddathulu.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 145

భర్త ప్రర స్త్రీ సంపర్కంతో ఈ వ్యాధి తెచ్చిపట్టుకున్నాడు. అదే ఆమెకు సంక్రమించి సంకటస్థితి తెచ్చి పెట్టింది. గనేరియా క్రిములు పైకి ప్రవేశించి నిదానంగా ట్యూబులని వ్యాధిగ్రస్తం చేశాయి. దానివల్ల నే కడుపులో నొప్పి, రతిలో బాధ కలగనారంభించాయి.

పై విధంగా కొందరి స్రీలలో సుఖవ్యాధులవల్ల కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అయితే అసలు కారణాన్ని గుర్తించలేక ఆపరేషను చేయించుకోవడం జరిగింది గనుక ఆలోచన లేకుండా ట్యూబెక్టమీ అంటగట్టడం ఆనవాయితీ అయిపోయింది. ఆపరేషను అయి అయిదు సంవత్సరాలైనా తరువాత ఏ బాధవచ్చినా అదంతా ట్యూబెక్టమీ వల్లనే అని భావించే అమాయక స్త్రీలు ఎందరో లేకపోలేదు, అమీబియాసిస్ వల్ల కడుపులో నొప్పి వచ్చినా, జీర్ణకోశంలో పూతవలన మంట, నొప్పి వస్తున్నా, ట్యూబెక్టమీ ఆపరేషను వలనేనని భావించే వాళ్ళు లేకపోలేదు.

గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలకి మూత్ర కోశంలోగాని, మూత్రపిండాలలోగాని వ్యాధి క్రిములు చేరుతాయి. దీనివల్ల కడుపులోనొప్పి, నడుం నొప్పి కనబడుతూ ఉంటాయి. కాన్పు అయిన తరువాత ఆపరేషన్ చేయించుకుని పై కారణాలవలన కడుపులో నొప్పి వస్తూ