పుట:Kumbharaana020881mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం పదునొకండు] కుంభ రాణా 87

అగ్బ : అగ్బరు మీ యంత:పురముఁ జొచ్చినది నిజము. తన జీవితమును పునీతముచేసి కొనుటకై పరమ భక్తురాలైన మీరాబాయిని సందర్శించెను. ఆమె పాదరజ: ప్రసాదము యాచించుట కొఱకు సాధారణ ధర్మములు లెక్క సేయక పాదుషా సాహసించెను.

రాణా : [భూమిపైనుండి సగము నిక్కి] ఏమీ? అగ్బరు మీరాను మోహింపలేదా?

అగ్బ : తల్లి స్తన్యపానము చేయుచున్న పసిబిడ్డకు మోహ మంట గట్టు నీచు డెవ్వఁడుండును?

రాణా : నీవెవ్వడఁవు? అగ్బరు సహాయులలో నొక్కఁడవా?

అగ్బ : నేనే అగ్బరును.

రాణా : [క్రోధముతో] అగ్బర్! [దూరముగ పడియుండిన కత్తి కయి చేయి తడవును]

అగ్బ : [కత్తితీసికొనివచ్చి కుంభరాణా కందించుచు] నా మరణమువలన నీ హృదయము నీ మరణకాలమున క్రోధరహితమయి, సుఖవంతమగు నేని నన్ను వధింపుము. ఇదిగో! అనాచ్ఛాదితమైన నా వక్షస్థలము. [మోకాలుపైన వంగును]

తాన్ : ఏమి యీ సాహసము? [చేయిపట్టుకొని పైకి లాగును]

రాణా : [ఇతి కర్తవ్యతా మూఢుఁడయి, ఆశ్చర్య స్తంభితుఁడయి] పాదుషా, నీవు సత్యము పలుకుచున్నావా? ఇంతదనుక నన్ను బాథించుచున్న సంశయము కేవలము స్వప్నమా? మీ రిరువురును నిరపరాథులా?

అగ్బ : రాణా, నీ యెడల నాకు జాలి కలుగుచున్నది. మీరాబాయి మాతల్లి. నే నామె పుత్రుఁడను. ఇంతకన్న నెక్కుడుగ నేనేమి చెప్పఁగలను? నీకేల యింత భ్రాంతి కల్గెను?

రాణా : పాదుషా, నా హృదయమున మెరముచుండిన శల్యమును పెరికి వైచితివి. నాకు నీవు ప్రబలద్వేషి వయ్యును ఇప్పుడు పరమాప్తుఁడ