పుట:Kumbharaana020881mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం తొమ్మిది] కుంభ రాణా 79

యపవాదము నా జీవితమునకు కళంక మాపాదించుచున్నది.

తాన్ : మీరాబాయి పావన చరిత్రము లోకు లెల్లఱకు విదితము సామాన్యములైన యంత:పుర ధర్మములు మానా వమానముల కతీతయైన యా పరమ భక్తురాలియెడఁ జెల్లవు, మీ సదుద్దేశమును బ్రజలు శంకింపరు.

అగ్బ : ఎట్టులో సమాధానపఱచుకొనుటకు మార్గములు కలవు - కాని, మన తొందరపాటునకుఁ బర్యవసాన మేమి? మీరాబాయి హత్య! - ఇది మరణాంతమువఱకు పీడించు హృదయ శల్యము. ఈ రాత్రియె యామె మరణింపవలయునని వింటిమిగదా!

తాన్ : [ఆలకించి] దారిలో పదశబ్దములు వినవచ్చు చున్నవి.

అగ్బ : [ఆలకించును]

[మీరాబాయియు కొంతదూరమున కుమారసింహుఁడును బ్రవేశింతురు.]

తాన్ : ఏదోయొక స్త్రీవ్యక్తి.

అగ్బ : అమ్మా, మీ రెవ్వరు?

మీరా : పథికురాలను.

అగ్బ : ఎచ్చటి కేఁగుచున్నారు?

మీరా : బృందావనమునకు.

అగ్బ : ఆదారి తప్పివచ్చితిరి. ఈ త్రోవ యమునానది యొద్దకు పోవును.

మీరా : ఇదియే దగ్గరి మార్గము.

అగ్బ : అడవిదారి ఒంటరిగా పోవుచున్నారు.

మీరా : తోడు లేనివారికిఁ దోడ్పడు బంటు ముందు నడచు చున్నాఁడు.