స్థలం ఎనిమిది] కుంభ రాణా 73
సేనా : [ఆశ్చర్యముతో] మరణ దండనమా ! ఎందులకు ?
రాణా : [కోపముతో] ఏమీ? యీ యాజ్ఞా విమర్శన మహామారి యందఱకు వ్యాపించి నట్లున్నది ! - అది నాయుత్తరువు.
సేనా : అమాత్యు లంతటి యపరాధ మేమిచేసిరి?
రాణా : [కోపము నడచుకొనుచు] ఆ విచారము నీ కనవసరము నా పనుపు సేయుము, పొమ్ము.
సేనా : నిరపరాధులను నేను హత్య చేయఁజాలను.
రాణా : ఇది హత్యకాదు. దండనము.
సేనా : నిర్హేతుకమైన దండనము బలాత్కార హత్య.
రాణా : [విసుగుతో] ఇంక వేఱేమి హేతువు కావలయును? సతీత్వమర్యాదను అతిక్రమించిన మీరాకు మరణశిక్ష విధించితిని. అమాత్యులు నాయాజ్ఞను తిరస్కరించిరి.
సేనా : అపరాధ మొనరించినది అగ్బరు, అతఁడు దండ్యుఁడు.
రాణా : [కోపముతో] నీవు నాకు ధర్మోపదేశము చేయునంతటి పండితుఁడవైతివా? అమాత్యులయొద్ద శిక్షపొందితివా ?
సేనా : అపరాధులే దండ్యులగుట న్యాయమని మనవి చేసితిని.
రాణా : ఇరువురును దండ్యులె. ఆ అగ్బరును మాత్రము వదలిత నను కొంటివా ? ఆ దురాత్ముని రక్తపూరము మాయంత:పురమునఁ జల్లించి అంటు వాపెదను. మీరాను శిక్షింపనిదే లోకము సంతృప్తిపడదు - ఈ యనవసర కాలయాపన మెందుకు ? - నాయాజ్ఞను నిర్వహించెదవా? లేదా? - ఒక్కమాట.
సేనా : సంగ్రామభూముల విరోధికంఠ నాళముల నిష్కరుణముగ చెండాడితిఁగాని, ఎన్నడును నిరపరాధులను హత్యగావించి యెఱుఁగను. మీరు నన్ను నిర్భందించుదురేని ఇదిగో! నాయధికార చిహ్నమునకు మీకు సమర్పించుచున్నాను [కత్తిని రాజుపాదములకడ వైచి నిష్క్రమించును.]