పుట:Kumbharaana020881mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 65

సదుద్దేశములు అపరాధ కళంకమును తుడిచి వేయఁజాలవు. ఇఁక నేను బూటకపు సమాధానముల నమ్మను. ఇదివఱకు నా యనుమానము నిర్హేతుకమని తలఁచి యుంటిని. సందేహ వశంవదుఁడనైన నా యభిప్రాయము నణఁగ ద్రొక్కి నిష్పక్షపాత బుద్ధితో అన్యునివలె విషయ పరిశీలనము గావించితిని ఇప్పుడంతయు స్పష్టమైనది.

శ్యామ : ప్రథమ విచారణయందు దోషములని తేలినవి. కొన్ని పునర్విచారణయందు నిర్దోషములని నిరూపింపఁ బడవచ్చును. మేఘాచ్ఛన్నమైన యాకాశము ఒక్కపెట్టున మేఘ నిర్ముక్త మగుటలేదా?

రాణా : మీ కవితా ప్రియత్వము మన్నింపఁ దగినది.

శ్యామ : దేవరవారు నామనవిని తుదివఱకు చిత్తగింపుఁడు : - అగ్బరు చక్రవర్తి మాఱు వేసమున మన యంత:పురము జొచ్చినది నిశ్చయము. అది అంత:పురధర్మమునకు కేవలము విరుద్ధము.

మాధ : నింద్యమును.

శ్యామ : నింద్యమె, కాని! -

రాణా : [విసుగుతో] కాని యేమి?

శ్యామ : కొంచెము ఓర్పు వహింపుఁడు.

రాణా : నిరర్థక కాలయాపనము !

శ్యామ : అయినను ఇచ్చట కార్యోద్దేశము ముఖ్యముగ గమనింపఁదగిన విషయము. రాణిగారు సర్వభోగములఁ బరిత్యజించి, వైరాగ్యమూని నిరంతరము శ్రీకృష్ణపదధ్యాన పరాయణయై కాలము గడపుచున్నది. ఆమె భక్తురాలను కీర్తి దేశమంతట వ్యాపించియున్నది. ఆమెను దర్శించుటకు వేనవేలుగ భక్తులు వచ్చుచుందురు.

రాణా : ఇంతకు మీమాటలలో స్ఫురించున దేమనఁగా, మీరా యొక లోకాతీతయైన భక్తురాలు, అగ్బరు లోకాతీతుఁడైన పరమభాగవ