పుట:Kumbharaana020881mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

సుశీ : అంతకుముందు లేదండి దొరగారు, వాళ్ళు రాణిగారికి నజరు తెచ్చినారేమొ.

రాణా : వైద్యులేమి అంత:పురమున కిట్టి నజరులు తెచ్చుటయేమి? ఇదియొక క్రొత్తచికిత్స కాఁబోలు !

బల : [స్వగతము] ఇది అటుతిరిగి యిటుతిరిగి కడపటికి నాప్రాణముల మీదికే వచ్చునట్లున్నదే.

రాణా : పాతర త్రవ్వఁబోవఁగా భూతము బయట పడినట్లు ఇదేదియోయొక క్రొత్తవిషయము బొగడపొడిచెను. దీనినంతయు మా యమాత్యులుకూడ విచారించి పరిశీలించిన బాగుగనుండును - ఓరీ

ద్వారపాలకుఁడు : దాసుణ్ణి.

రాణా : మా మంత్రులను నిచ్చటకు రమ్మని చెప్పుము; శీఘ్రముగ'

ద్వార : చిత్తం [నిష్క్రమించును.]

రాణా : బలవంతరావ్, ఆవైద్యులు మీయుత్తరువు తీసికొని యంత:పురములోనికి ప్రవేశించిరా?

బల : [సగర్వముగ] నా యనుమతి లేనిదే పోతుటీఁగ కూడ అంత:పురములోనికి ప్రవేశింపదు.

రాణా : వారి వేషభాష లెట్లుండినవి ? అసాధారణ విశేషము లేవియు మీకు తోఁపలేదా ?

బల : వారివేషములు వారికి తగినవిగనే యుండినవి. వారి సంభాషణ యోగ్యతను పట్టిచూడగా రాజసంస్థానములలో మెలఁగిన వైద్యులవలెనే యగపడిరి. ద్రవ్యార్జనముకంటె వ్యాధి కుదిర్చిన కీర్తియే వారికి ముఖ్యమైనట్లు తోఁచినది. తిరిగి పోవునప్పుడు సంభావన మాటయే యెత్తలేదు.

రాణా : [కోపము బిగపట్టుకొని] అప్పుడు నీబుద్ధి స్వాధీనమున నుండినదా లేక అభిని మత్తున తూఁగుచుంటివా ?

బల : [తత్తరముతో చేతులు పిసుగుకొనుచు, స్వగతము] రాజు