పుట:Kumbharaana020881mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఐదు] కుంభ రాణా 39

లోకేశ్వరా, ఎందుకీ లీలావిలాసము ? నీదివ్యమంగళ సౌందర్యము నీ యనంత ప్రకృతి దర్పణమునఁ ప్రతిఫలింపఁజేసి నిన్నునీవు చూచుకొనుటకా ? [బయలుచూచి క్రమక్రమముగ ధ్యాననిమగ్న యగును.]

సుశీ : ఈయమ్మగారి మాటలూ మందలింపులూ నాకు సంస్కుతంగావుంది - నిన్నటిరాత్రంతా కునికిపాటైనాలేక యీమెతోటి మేల్కొని అవస్తపడ్డాను. కొంచమట్ట కన్ను మాలస్తాను. ఆముదనష్టపు వాసంతికతో నాకు అత్తపోరయింది. [పైటచెంగు పఱచుకొనియొక మూలగ పరుండును]

మీర : నన్నేల యింకను నీయొద్దికి చేర్చుకొనవు ? దవాగ్ని మధ్యమున పరితపించుచున్న యీ కురంగిని కాపాడుటకు నీకింకను దయ గలుగులేదా ? నీకంఠమున వేయుటకై కట్టిన పొగడదండ నాయంజలిపుటమున కమలి పోయినది. ఇంకను నీవురావేమి ? నేను పంపుచుండిన బాష్పదూతికలు నిన్నింకను చేరలేదా? నా విన్నపమును గొనిపోయిన బలాకలు దారిలో నేమైన నాలసించినవా ? లేక నీవే యుపేక్షించితివా ?

                     ధూళి గప్పిన యీజీర్ణ చేలఁదాల్చి
                     గఱిక పువ్వులు కొప్పులోఁ దుఱిమి, ముసుఁగు
                     టంబరంబును రాణివాసంబు వీడి
                     దుమ్ము గద్దియ నెక్కితిఁ దుదకు నాథ !

ఇంకనైనను నీచరణదాసినగుటకు తగనా ? పూర్వ మా రుక్మిణిని గొనిపోయినట్లు నన్నేల గొనిపోవు? రాధామనోవల్లభా, నీవు రాధాకౌఁగిటిలో చిక్కియున్నావు. లేకయున్న నీవేల మఱతువు, రాధా ? నీవు ధన్యవు - ధన్యవు - [ధ్యాన నిమగ్నయగును.]

సుశీ : [మేల్కొని కూర్చుండి పైటచెంగుతో విసురుకొనుచు] అబ్బా ! యీ హడావుడిలో నిద్రపట్టడంగూడానా. [ఆవులించి, తూగి,