పుట:Kumbharaana020881mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 కవికోకిల గ్రంథావళి [స్థలం మూడు

                     కాయ మనపాయ మని యెంచి కాలమెల్ల
                     మిట్టిపాటులఁ బుచ్చెదు మీనరాజ,
                     విధి యదృశ్యహస్తము వెనువెంట నంటి
                     కడకు నిను మృత్యుపదముల కడకు గెంటు.

రాణా : [స్వగతము] ఇంతవఱకు నాయుద్దేశము తనయుద్దేశముగ నుండినది. ఇప్పుడు భిన్నము. ఇదియంతయు దుర్మతముయొక్క వైపరీత్యము [ప్రకాశముగ] అవునుగాని, మీరా, యీపాలఱాతిబండ జ్ఞప్తియున్నదా ?

మీరా : పూర్వము మనకు విశ్రాంతిపీఠము.

రాణా : పూర్వము ! - అవునవును పూర్వము ! మఱియొకమాఱిచ్చట కూర్చుండి మున్నటి వినోదములను ఆప్రణయ సఖ్యమును కొంచెము సేపు కల గనియెదము వచ్చెదవా ? ఆస్మృతి మందపవనుని సుఖోచ్ఛ్వాసమువలె, నాయొడలు పులకరింపఁజేయుచున్నది.

మీరా : కలయని తెలిసియు దానిపై నింతమక్కువ యేల ?

రాణా : [విసుగుతో] నీయీపిచ్చి ప్రశ్నలే నన్ను మాటిమాటికి హతాశుని చేయుచున్నవి. నీకేదో చిత్తచాంచల్యము కలిగియుండవలయు. రమణీయస్వప్నము ఆనందదాయకము కాదా ?

మీరా : ఆ యానంద మెంతకాలము ? కలగనినంతకాలమె. మనమేల నిరంతర దివ్యానంద మనుభవించుటకు యత్నింపఁగూడదు ?

రాణా : [ఆసతో] ఆ యానంద మెట్టిది ?

మీరా : అమృతానందము; శ్రీకృష్ణలీలాధ్యాన పారవశ్యము.

రాణా : [లాఘవముగ నవ్వి] ఓసీ పిచ్చిదాన, నీమాటలు నాదు:ఖమునందు కూడ నవ్వుపుట్టించుచున్నవి. నామనస్సు తేలికయైన యగరు ధూపమనుకొంటివా గాలిలో నెగిరిపోవుటకు ? ఊహమాత్రమైన పాల సము