పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణరాజ్యాంగస్థితి.

శిక్షింప గల్గుట మహాభారతమున దీనిని "దండ" మని వాడబడి యున్నది. కాలక్రమమున మూఢాభిప్రాయము లెన్నియో ఈ "దండ"ముయొక్క యధార్దమగు నర్ధముచుట్టును మూగెను. శాంతిపర్వములోని 1`2-122 అధ్యాయములలో నీ "దండ"ముయొక్కయు, తదాకారముయొక్కయు, దాని యుత్పత్తియెక్కయు వర్ణనలు కలవు. ఈ "దండము" ప్రజాపతివలన సృష్టింపబడెననియు, సర్వజనులయెడ నిష్పాక్షికముగా వాడబడిదగిన దనియు మేమిదివరకే వ్రాసియున్నాము. బ్రహ్మదీనిని క్షత్రియులకే యిచ్చెను. రాజు దీనిని యధేచ్చముగా ప్రయోగింపగూడదు. బ్రహ్మ విధించిన సమయముల ననుసరించి దీనిని వాడవలయును. "మానవజీవితము స్వల్పకాల పరిమితమగుట వలన క్రమముగా 3000 అధ్యాయములలోను 1000 యధ్యాయములలోను రచించిరి. మహాభారతముయొక్క తుది *నిర్మాణకాలమున నీ రేండు గ్రంధములు ఉండియుండవచ్చును, ఇప్పటికిని ఇట్టిపేర్లు గల గ్రంధము లున్నవి కాని యవి సౌతి # కాలమున నుండినవి కాక పొవచ్చును. శాంతిపర్వములోని రాజధర్మఘట్టము


  • మహాభారతము మూడుమారులు నిర్మితమయ్యెననియు, ప్రస్తుతాకారము తుదియనియు, వైద్యా గారిభావము మా.హ.

$మహాభారతముతుదిమారు నిర్మించినవాడు (సౌతి) వైద్యాగారియాశయము(వైద్యాగాని "మహాభారతము"అను గ్రంధమును జూడుడు.)

మా హ