పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వారులు.

నాటికి హింద్వార్యుల రాజ్యాంగదశ విషాదకరముగా నేల కూలెనని దెలియుచున్నది.

   రాజగువానిని ఎవరును అంటనైన కూడదనియు, అతని వచనములు దేవవాక్యములనియుకూడ నవస్థకు ఆకాలము వారు పాల్పడిరి. రాజు విషయమున దురుద్దేశములుకలవాడు ఈలోకముననేగాక పరలోకమునకూడ శిక్షననుభవించునని వారి తలంపు. *సుప్రసిద్దమగు నీశ్లోకము శాంతిపర్వమున నున్నది. $"మన్యుడేకదాయని రాజును చులకనగా జూడగూడదు. రాజనగా నరరూపముననున్న గొప్పదేవత." అధర్ములను శిక్షించునపుడును, నధర్ములను రక్షించునపుడును, "రాజు" యముడుగాను, "ఒకనియొద్దనుండి రధమును లాగికొని మరియొకనికిచ్చునపుడు "కుబేరుడు" గాను ఎంచబడు చుండెను. రాజు చేయుపనులు సక్రమములా యక్రమములాయని ప్రశ్నించు అధికారము ఎవరికిని లేదు. రాజద్రవ్యావహారి ఈలోకమున శిక్ష నొందిటయేకాక అతిలోతైన నరకూపమునకూడ కూలునని నమ్మబడుచుండెను. వేయేల? రాజుయొక్క దైవాంశ జనుల మనములందుధృడముగా నాటుకొనినందున, వారాతనికి జూపు విధేయత దాస్యముకు సమానమగు స్థితికివచ్చెను.
           రాజునకుగల యధికారములలో నెల్ల గొప్పది జనులను

  • యుస్తస్యపురుష: పాపం, మనసాప్యనచింతయెత్ ।మహాక్లిష్త:, ప్రేత్యాపినరకం శ్రజేత్॥

$నహిజాత్వమంతన్యో, మనుష్యఇతిభూమిప: । మహదేవతా హ్యేషా, నరరూపేణతిష్టతి॥