పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

రాంశసంభూతులుగనుజేసి ప్రజలహక్కులను నానాటికి నశింపజెసెను,ఇక పశ్చిమమున గ్రీకులు రాజ్యాంగవిషయమున దమ భావముల వృద్ధిపరచుకొనిరి. అది యెట్టివృద్ధియనుకొనెదరు. నిరుపమానమైనది. ఆనాటిమాటయేకాదు; నేటికిని అధెన్సు ప్రజానత్తాకరాజ్యమే ప్రపంచమునందలి సకలప్రజాసత్తాకరాజ్యముల కును ఆదర్శమై యెప్పుచున్నది. ఇట్టి ప్రపండభేదము మనకును వారికిని కలుగుటకుగల కారణములను వెదకుట చాలకష్టము. ఆప్రయత్నముయ్ ఈవ్యాసముయొక్క యుద్దేశమునుకాదు. ప్ర్రాయశ: కారణములు ఈక్రిందివైయుండవచ్చును:- 1 జాగిభేదము లేర్పడుటవలన జనసామాన్యము రాజ్యాంగమున దమవిధుల మరచిపోయినందున క్షత్రియులుమాత్రమే ఈవిషయమునజోక్యం పుచ్చుకొన దగినవారైరి. 2. ఆర్యులు బహుళసంఖ్యాకులగు శూద్రులను సంఘమున ప్రవేశపెట్టుకొనిరి; కాని వారిని కాయకష్టమునకు పాలుచేసినందున జనసంఘములోని గొప్ప భాగమును రాజ్యాంగవిధులకు అనర్హముగచేసిరి. 3.మైదానములలో జనావాసము విశేషమగుటవలన, రాజ్యములు చిన్నవిగా నుండినప్పుడు జనాభిప్రాయమును దెలిసికొనుటయందుగల సౌకర్యములు తరువాత లేకపోయెను. ఇప్పటికాలమున విశాలములగు దేశములందు జనాభిప్రాయమును గనుగొనుటకు ఏర్పడిన పద్ధటూళూ ఆకాలమున జనులెరుగరు.

  ఇక పశ్చిమమున గ్రీసుదేశపర్వత ప్రాంతములలో వసించిన తెగలవారు అందఱు ఒకవిధమైనవారుగను, దాదాపుగా అందరు ఆర్యులుగను, ఆదిమనివాసులసంబంధము మిగులతక్కువ