పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి సాధారణ రాజ్యాంగ స్థితి

                     ----==---

అయోమార్గమొకటి ఒకస్థలమునుండి వెడలి కొంతదూరమువఱకు ఒకవిధముగా సాగిపోయి, అచ్చటనుండి రెండుశాఖలుగా జీలి రెండుభిన్నదశలకు బోయి పోయి ఆతనాగిపోవుటయు, శాఖ లాగి పోయిన భిన్న అంతిమస్థానము (terminus)లకు నడుమ ఎన్నియో మైళ్ళేఎడమేర్పడుటయు మనము చూచుచున్నాము. హంద్వార్యుల నాగరికతయు, గ్రీకార్యుల నాగరికతయు, ఈ యయోమార్గముపుగతిని పోలియున్నది. ఈ రెండు నాగరికతలును ఆరంభమున నొకస్థలముననే యుద్భవించెను; ఒకవిధముగానే వృద్ధిచెందెను. తరువాత నవి భిన్నమార్గముల ననుసరించి పోయి పోయి, తుదకు రెంటికిని ఏమాత్రమును సామ్యములేని యవస్థకు వచ్చినవి. ఇట్లీయంతరము పైరెండు తగలవారి యాహారవస్త్రాదులలో వాటిల్లినట్లె, క్షాత్రయుగాంతము నాటికి వారి సాధారణ రాజ్యాంగ దశయందును సంభవించియుండుట మనమీవ్యాస్మౌన జూడగలము.

   క్షాత్రయుగరంభమున హింద్వార్యుల రాజ్యాంగస్థితి ఎట్లుందెనని మనము కొంత్ సూక్ష్మదృష్టితో బరికించితిమేని