పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారివివాహములు.

వచ్చును. ఏలయన ఎంతోకాలమునుండియుందినవేకాని పైదండయాత్రనాటికి ఇది ఆచారముగాను పుణ్యకార్యముగాను స్థిరపడి యుండదు. అయినను క్షత్రయుగారంభమున నీయాచార ముండెనో లేదో స్పష్టముగా కానరారు. మాద్రి సహగమనముచేసెనని మహాభారతములో నున్నది. కాని పైనవచ్చిన "కాధియసు" లే మాదేయులని వెనుక చూచియున్నాము. కనుజ్క వారియందుండినయాచరము హిందూదేశమునందంతట నుండెనని చెప్పజాలము. కృష్ణునిభార్యలలో కొందఱు సహగమనము చేసినట్తు భారతమున నున్నది. కాని ఇదిప్రక్షిప్తమేమో యని సందియమగుచున్నది. ఏలయన, దుర్యోధనునిభార్య లెందఱో ఉండినట్లున్నది కాని వారిలోనొకతయైనను సహగమనముచేసినట్టు లెదు. అంతమాత్రమున క్షాత్రయుగారంభముననీయాచారము లేదని రాయిగ్రుద్ది చెప్పజాలము. అయినను, ఈయుగాంతమున మాత్రము పైయాచారము సంపూర్ణదశనంది యుండెనని గ్రీకులవ్రాతలు చెపుచునే యున్నవి. కనుక సహగమనాచజరము సిధియనుల దండయాత్రలతోబాటు క్రీ.పూ.రెందవశతబ్ధమున మనదేశమున ప్రవేశించినదను దత్తుగారి సిద్దాంతము నిలువజాలదు.

                            ---=--