పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

గూడ కానవచ్చుచున్నది. అట్లే గ్రీకులు మన స్త్రీలవిషయమున నపోహపడియుందురు.

   గ్రీకుల కాలములో సహగమనమున ముండినట్లు వారి వారి వ్రాతలవలన గానవచ్చుచున్నది. "కాధియను" స్త్రీలుతమ మృతభర్తల చితిపైనెక్కి కాలి చచ్చెదరని వారు వ్రాసియున్నారు. ఇంతటిస్వార్ధత్యాగముతోను మనస్త్రీలు తమయుసురుల బాయుట కారణము కనుగొనజాలక వారు "భార్యలుతమ భర్తలకు విషప్రయోగము చేయకుండుటకై హిందువులు ఈ యాచారమును సంఘమున ప్రవేశపెట్టిరి." అని వ్రాసిరి. *మనస్త్రీల వర్తనమును గుఱించి దురభిప్రాయమపడినవారగుటచే వారిట్టియూహనుపన్నిరి. "మాక్ క్రిండల్" అనునతడుసహగమనముగూర్చి యొకచోట "దయదొరను" అనునాతనిఈక్రిందివచనము నుల్లేఖించి యున్నాడు."యూమనను అంతిగొనుసు అనుప్రదేశములకు నడుమనుండు గాబీసునందుజరిగిన సమరములో నిహతుడైన "కెరియను" అనువానిభార్య లిరువ్చురును భర్తతో సహగమనము చేయుగౌరవము తనకబ్బవలెను తనకబ్బవలెను అనివివాదపడిరి. వారిలోపెద్దది గర్భవతిగానుండుటచేత ధర్మశస్త్రములు ఆమె మరణము నంగీకరీంపలేదు. "హొందూ స్త్రీలు తమభర్తలవెంట తాము మన:పూర్తిగా మరణింతురు" అనిఅరిస్టాబ్యులసు మున్నగు చరిత్రకారులు వచించిరని "స్ట్రాబో" వ్రాసియున్నాడు. కనుక ఈయాచారము అలెగ్జాండరుని దండయాత్రకు చాలాకాలము ముందునుండియే మనదేశమున నుండ

  • "అలెగ్జాండరుని హిందూదేశపు దండయాత్రె, మాక్ క్రిందిలొకృతము.