పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారివివాహములు.

లేదు. హిందూయువతులు తమప్రేమను ఎవనికైననుసరే ఏనుగువెలకమ్ముచుందురని వారు వ్రాసియున్నారు. *కొందఱు చాకిరి ఛెయించుకొనుటకును, మఱికొందరు స్వసౌఖ్యముకొఱకును, గృహములను పిల్లలతో నింపుకొనుటకును హిందువులు పలువురు స్త్రీలను పెండ్లియాడెదరని వారభిప్రాయ పడినారు. "కనుక బలవంతముగా నిర్భంధమున నుంచిననేకాని వారు వ్యభిచ రింతురు."అని వ్రాసియున్నారు. $ నిర్భంధమున నుంచబడినస్త్రీలు దుర్వర్తనమునకు పాల్పడియుండుట క్షాత్రయుగమున సంభవించి యుండవచ్చును. వేలసంఖ్యగల కృష్ణుని భార్యలను అర్జునుడు వెంటకొనిపోవునపుడు వారిలోకొందఱిని కిరాతులెత్తుకొని పోవుటయు కొందఱు తమఇష్టానుసారమే వారివెంటబోవుటయు మనకు మహాభారతమున గానవచ్చుచున్నది. కనుక ఇట్టియుదాహరణముల నెచ్చటనొచూచి గ్రీకులు పైవిధమున వ్రాసి యుందురేమో గ్రీకులు పంజాబుదాటి రాలేదు. కనుక వారు స్వయముగా నెఱిగినదా దేశమునుమాత్రమే. కనుక పంజాబుదేశపు చిత్తస్థయిర్యమును స్వతంత్రశీలమును కల స్త్రీలను జూచి గ్రీకులు హిందూదేశపుస్త్రీల పావిత్ర్యము విషమున దురభీప్రాయపడి యుండవచ్చును. ఆకాలమున హిందూస్త్రీలస్థితికి పంజాబులోని స్త్రీలస్థితికిని చాలభేదముండెను. అంతేకాక స్వాతంత్ర్యము ననుభవించు స్త్రీలనీతివర్తనమును గుఱ్ంచి జనులకు తప్పుడభిబప్రాయము జనించుట మనదినములలో


  • "మెగస్థనీశు మఱియు ఏరియను" మాకి క్రిండల్ కృతము.

$ " " "