పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నాటికి ఆర్యులు వివాహపద్దతిని ఏర్పరచుకొనియే యుండిరి. కాని అది యింకను వారిచుట్టునున్న అనార్యజాతులలోకేవలము ఆరంభదశయందేయుండెను. ఉదాహరణార్ధము ఉత్తరకురుదేశస్థులు #పాండవుల కాలమున ఇంకను వివాహము చేసికొనుచుండనేలేదు. ఈయంశమునుబట్టియేకాబోలును "హిరోదోటసు" అను గ్రీకుచరిత్రేకారుడు "హిందువులు పశువులవలె బహిరంగముగా సంభోగించెదరు" అని అతిశయోక్తితో వ్రాసినాడు. బహుభార్యాత్వబహుభర్తృత్వ నియోగములు ఆర్యులందుండెను. బ్రాహ్మణులందు వివాహములు క్రయవిక్రయదశనుండి కన్యాదానదశకు వచ్చుచుండెను. క్షత్రియులలో స్వయంవరపద్ధతి హెచ్చుచుండెను., నల్లనివర్ణముగల యాదిమ నివాసులతొ సంపర్కము కలిగినందున అర్యులలో స్వీయజాత్యభిమానము మెండై ప్రతిలోమ వివాహనిషేధమువంటి నియమము లెర్పడసాగెను. "అభుక్త" స్త్రీలుమాత్రమే వివాహయోగ్యులుగా నెంచబడుచుండిరి. వితంతువులు అల్పజాతులతో పునర్వివాహము చేసికొనుచుండిరి. బాలవివాహములు బొత్తగానే లేవు. వెనుక చెప్పబదిన ఆచారముల వివాహపద్ధతులు క్షాత్రయుగము నం


  1. అనావృతాణిలపురా స్త్రీయసన్ నరాననే । కామచారావిహారిజ్య॥ స్వతంత్రాశ్చారుహాసిని॥

రమాణదృష్టోధర్మోయం పూజ్యతేచమహర్షిభి॥ । ఉత్తరేషుచరంభోరు కురుష్వద్యాపిపూజ్యతే॥అది॥ ఉత్తరకురుదేశస్ధులు తిబెతీయు లెయైనపక్షమున ఈవచనము ఇప్పుడును వారికి వర్తించుచున్నది.